ఎవరీ రాజూ రవితేజ!

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుంచి విపరీతంగా వినిపిస్తున్న పేరు రాజు రవితేజ. ఎవరీ రవితేజ అని ఆరాతీస్తే ఈయన తన ఉపన్యాసాలతో, సలహాలతో, పుస్తకాలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి అని ఆయన నిర్వహిస్తున్న రాజు రవితేజ్ డాట్ కామ్ అనే పోర్టల్ ద్వారా తెలుస్తోంది. తనను తాను ఒక ఆలోచనాపరునిగా, ఉపన్యాసకర్తగా, రచయితగా, శిక్షకునిగా ఆ పోర్టల్‌లో ఆయన ఉంది. దాని ప్రకారం ఆయన చాలా దేశాల్లో ప్రసంగాలు చేశారు. ఒక పేద కుటుంబానికి చెందిన రవితేజ్ పదహారేళ్ల వయసులో ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆఫీస్ బాయ్ స్థాయి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఎదిగారు. 22 ఏళ్ల వయసులో యూరిస్కో కన్సల్టింగ్‌ను ప్రారంభించక ముందు వాణిజ్య ప్రకటనల రంగంలో కన్సల్టెంట్‌గా ఉన్నారు. భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల్లోనూ, యూరప్‌లోనూ 100కు పైగా సంస్థలు సలహాదారునిగా ఆయన సేవలను వినియోగించుకున్నాయి. దేశంలోని 65 విద్యా సంస్థలతో ఆయన కలిసి పనిచేశారు. ఎపిఎస్ఆర్టీసికి చెందిన 1,20,000 ఉద్యోగస్తులకు సంస్థ పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా శిక్షణనిచ్చారు. ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాల్లో ఉపన్యాసాలిచ్చారు. మన సంస్కృతిపై ఒక షార్ట్ ఫిల్మ్‌కు స్క్రిప్ట్ సమకూర్చి, అందులో నటించారు. ఒక బాలీవుడ్ సినిమాకి కూడా స్క్రిప్ట్ సమకూర్చారు. ఆయన రచించిన 12 పుస్తకాల్లో 10 పుస్తకాలను దేశంలోని 183 స్కూళ్లలో పాఠ్యగ్రంథాలుగా చదువుతున్నట్టు ఆయన సైట్‌లో చెప్పుకున్నారు. పిల్లల కోసం, యువత కోసం పుస్తకాలు రాస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన నిర్వహించిన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. 1994లో 'యూరిస్కో కన్సల్టింగ్' అనే సంస్థనూ, 2002లో 'ఇన్‌స్పైర్ ఇండియా' అనే లాభాపేక్ష లేని ట్రస్టును ప్రారంభించారు.

Share on Google Plus
  Blogger Comment
  Facebook Comment

2 comments:

 1. ఈయన వరంగల్ జిల్లా జమ్మికుంటకు చెందినవారని పవన్ గారు సెలవిచ్చారు. ఆ జిల్లాలో ఆ పేరు గల ఊరు లేకపోవడం విశేషం. "వరంగల్ జిల్లా జమ్మికుంటకు దారేది" అనేపేరుతో వచ్చే కొత్త సినిమాలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా!

  ReplyDelete
  Replies
  1. He is from karimnagar dist jammikunta village Jammikunta is a town and Mandal in Karimnagar District

   Delete