పోలవరానికి కేసీఆర్ ఎందుకు వ్యతిరేకం?


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి పోలవరంపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో... పోలవరం ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులలో నీళ్లు నిండిన తర్వాత మాత్రమే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు వదులుతామని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి ఆజ్యం పోస్తున్నాయి. అసలీ పోలవరం చరిత్రేమిటి? గోదావరి జలాల సద్వినియోగ లక్ష్యంతో... 1942నాటి ప్రతిపాదనలతో 1980నాటి అంజయ్య సర్కాకు కాలంలో పునాది పడినప్పటి నుంచి 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టే వరకు పురిటి దశలోనే మిగిలిపోయింది. అప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణంలో కొద్దిపాటి చలనం వచ్చిందంటే దానికి కారణం.. డాక్టర్ వైఎస్ ఆరంభించిన జలయజ్ఞమే. తర్వాత జాతీయ హోదా దక్కినప్పటికీ తర్వాత కాలంలో నెలకొన్న అశ్రద్ధ కారణంగా ఇప్పటికీ బాలారిష్టాలను ఎదుర్కోంటోంది. అయితే లక్షలాది ఆదివాసీలు తమ ఇళ్లు, భూములు జీవనోపాధి కోల్పోయి జీవన సంక్షోభంలో చిక్కుకొంటారని, కాబట్టి ప్రాజెక్టును రద్దు చేయాలని విమర్శలు వచ్చాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలోనూ ఈ ప్రాజెక్టుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక ప్రకటన చేశారు.  పోలవరం ప్రాజెక్టు పరిధిలో పూర్తి స్థాయిలో పునరావాస, పునరాశ్రయ చర్యలు సంపూర్ణంగా చేపట్టి, అవసరమైతే మరిన్ని సవరణలు చేస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇలాంటి ప్రకటనలు చేయడం గమనార్హం. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment