యాదవులకు సీమాంధ్ర పీసీసీ పీఠం


కాంగ్రెస్ అధిష్టానం  సీమాంధ్రలో కాపులకు పెద్దపీట వేస్తుందని అందరూ భావించినా.. పీసీసీ అధ్యక్ష పదవి యాదవ సామాజిక వర్గానికి చెందిన రఘువీరారెడ్డికి దక్కింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది కాపు నేతలు (ఘంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్ బాబు, చింతలపూడి వెంక్రటామయ్య, తోట త్రిమూర్తులు, కొట్టి సత్యనారాయణ మొదలైనవారు) తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడ్టట్లు తెలుస్తోంది! సీమాంధ్రలో మూడు ప్రధాన సామాజిక వర్గాల్లో రెడ్లు జగన్ వెంట, కమ్మలు తెలుగుదేశంతో వెళ్లనుండటంతో సీమాంధ్రలో అతిపెద్ద సామాజిక వర్గం కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించి కాపులను మచ్చిక చేసుకోవాలని హైకమాండ్ అనుకుంది. అయితే వారంతా తెలుగుదేశంతో వెళ్లనుండటంతో.. పీఠం బీసీలకు అప్పగించింది. యాదవ సామాజిక వర్గం మొదటి నుంచచీ టీడీపీకే అనుకూలంగా ఉంది. ఆ సామాజిక వర్గంలో యనమల రామకష్ణుడు శాసనసభ స్పీకర్ గా, వివిధ శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇంకా నెల్లూరు జిల్లా నుంచి బీద రవిచంద్ర యాదవ్ రాష్ర్ట తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఇకపోతే కాంగ్రెస్ లో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, తణుకు ఎంఎల్ఏ కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment