సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్!

ysrcp will win in seemandhra andhrapradesh ys jaganmohan reddy

ఎన్నికల వేళలో సర్వేలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పలు ఏజెన్సీలు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై సర్వేలు నిర్వహిస్తాయి. అయితే ఈ సర్వేలు కచ్చితంగా నిజమవుతాయని లేకపోయినా ఫలితాలపై ఒక అంచనాకు దోహదపడతాయి. అయితే తాజాగా ఎన్‌టీవీ - నీల్సన్ నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాల్లో 129 నుంచి 133 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుని తిరుగులేని విజేతగా నిలుస్తుందని తేలింది. అలాగే.. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ 19 నుంచి 21 స్థానాలు సొంతం చేసుకుని విజయదుందుభి మోగిస్తుందని స్పష్టమైంది. ఇక టీడీపీ సీమాంధ్రలో కేవలం 42 నుంచి 46 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుందని సర్వే స్పష్టంచేస్తోంది. ఈ పార్టీకి 4 నుంచి 6 లోక్‌సభ సీట్లు వస్తాయని సర్వే అంచనా. మొత్తం మీద సీమాంధ్రలో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని.. అయితే వైఎస్సార్ కాంగ్రెస్‌దే స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని సర్వే ఫలితం సారాంశం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర సహా ఇతర పార్టీలు 1 నుంచి 4 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశముందని సర్వే తెలిపింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

1 comments:

  1. NTV has dealings with Jagan. How credible it is? It's a fake survey.

    ReplyDelete