తగలబడిపోయిన 2.5 కోట్లు!

2core-50-lakh-rupees-fired

నల్గొండ జిల్లా సూర్యాపేట వద్ద ఇన్నోవా కారులో నోట్ల కట్టలు తగలపడ్డాయి. దగ్ధమైన కారుపై మాజీ మంత్రి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోతో కూడిన స్టిక్కర్ వుంది. కారు నంబర్ ఏపీ 29బీటీ 8289గా గుర్తించారు. ఎన్నికల సీజన్ కావడంతో కారు ఇంజిన్ భాగంలో నగదును పెట్టి తీసుకెళ్తుండగా ఇంజిన్ వేడికి నగదు కాలిపోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు తగలబడుతుండగా కొంత నగదును తీసుకెళ్లినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో దాదాపు 2 కోట్ల 50లక్షల వరకు నోట్ల కట్టలు ఉన్నాయని ఎన్నికల ప్రధానప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలీసులు సదరు ఇన్నోవా కారును సీజ్ చేసి  కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment