కిరణ్ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటారా?

Is Kiran decided to stay away from Elections?

జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. సొంత నియోజకవర్గమైన పీలేరు నుంచి కిరణ్ శనివారం నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆయన తీసుకున్న నిర్ణయంతో కిరణ్ సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ అధినేతగా ఉంటూ ఎన్నికలకు దూరంగా ఉండడంపై ఆయన పార్టీ నేతలే షాక్ కు గురయ్యారు. కిరణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఇది పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలనుకోవడమే కిరణ్ ఈ నిర్ణయం వెనుక అసలు కారణమని ఆయన వర్గీయులు తెలుపుతున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment