Video Of Day

Breaking News

ఐశ్వర్య మళ్లీ తల్లి కానుందా?

Ishwaryarai-pregnency-romour

బాలీవుడ్ నటీమణుల్లో ఐశ్వర్యా రాయ్ ది ఓ ప్రత్యేక స్థానం. ఎన్నో సినిమాల్లో ఆమె అభిమానుల్ని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఏ చిన్న విషయం తెలిసిన పెద్ద వార్తే. మూడేళ్ల క్రితం ఐశ్వర్య పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత ఐశ్వర్య సినిమాలేవీ అంగీకరించలేదు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా, ప్రహ్లాద్ కక్కడ్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి ఆమె పచ్చజెండా ఊపారనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఓటేయడానికి బయటికొచ్చిన ఈ సుందరిని చూసిన వారు అవాక్కయ్యారు. ఆ మధ్య సన్నగా కనిపించిన ఐశ్వర్య ఇప్పుడు మాత్రం కాస్త బొద్దుగా కనిపించారు. ఐశ్వర్యారాయ్ మళ్లీ అమ్మ కాబోతోందని, ఆమె శరీరాకృతి చూస్తే ఆ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఇది అభిమానులకు సంతోషకరమైన వార్తే అయినప్పటికీ...  వెండితెరపై అభిమాన తారను చూడ్డానికి మళ్లీ గ్యాప్ వస్తుందేమోనని భావిస్తున్నారు. ఏదేమైనా ఐష్ గర్భవతి అనే వార్త ఎంతవరకు నిజమో మరి!

No comments