తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి ?!

Woman-chief-minister-of-Andhra-Pradesh

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం సీటుపై కన్నేసిన ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. తెలంగాణలో సీఎం సీటు ఆశిస్తున్న డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు రాహుల్ మింగుడు పడని విషయాన్ని ప్రకటించారు.  తెలంగాణకు మహిళ ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరికని వెల్లడించారు. అంతేకాదు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ లక్ష్యం ఆయన అన్నారు. వరంగల్ జిల్లా ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా ఓటర్లను ప్రభావితం చేయడానికి రాహుల్ ఈ విధంగా మాట్లాడినప్పటికీ అసెంబ్లీ బరిలో ఉన్న టీకాంగ్ మహిళా నేతల్లో కొత్త ఆశలు పెరుగెత్తుతున్నాయి. మాజీ మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, వరంగల్ నుండి మాలోతు కవితలు రాహుల్ మాటలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment