తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం ఎవరు?60 ఏళ్ల కల సాకారమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడనున్న తరుణంలో కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే కేసీఆర్ లేదా ఆయన కుటుంబానికి చెందినవారే సీఎం అవుతారనడంలో సందేహం లేదు. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం సీఎం ఎవరన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే బీసీలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ఆ వర్గానికి చెందిన పొన్నాలకు పీసీసీ పీఠాన్ని కట్టబెట్టింది. బలహీన వర్గాలకే అధికారం అని చెప్పకనే చెప్పింది. దీంతో డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, మైనార్టీల నుండి షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అవకాశం తమనే వరిస్తుందని ఆశించారు. సీనియర్ల జాబితాలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment