సోనియా ఆస్తులు ఇంతేనా?

assets-of-sonia-gandhi-election-returning-officer-affidavit

రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనే అస్తుల వివరాలు సగటు ఓటరును మరింత ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా రాయ్ బరేలి లోకసభకు నామినేషన్ దాఖలు సమయంలో రిట్నర్నింగ్ అధికారికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ప్రభుత్వాన్ని శాసిస్తున్న సోనియాగాంధీ సమర్పించిన అఫిడవిట్లో ఈ అంశాలు వెలుగు చూశాయి.  సొంత ఇల్లు, కారు కూడా లేదంటూ ఆమె పేర్కొనడం విశేషం. అంతేకాకుండా 9 లక్షల లోన్ మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు. వీటితోపాటు సోనియా వద్ద 85 వేల నగదు మాత్రమే ఉండగా, 9 లక్షల అప్పును చెల్లించాల్సి ఉన్నట్లు, బ్యాంక్ అకౌంట్లలో 66 లక్షల రూపాయలు, వారసత్వంగా లభించిన 23 లక్షల రూపాయల విలువైన బంగారు అభరణాలు ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు. సోనియా వద్ద 12 లక్షల మ్యూచ్ వల్ ఫండ్స్, కొన్ని కంపెనీల షేర్లు కూడా ఉన్నట్టు అఫిడవిట్ పేర్కొన్నారు. 1.267 కేజిల బంగారం, 88 కేజీల వెండి ఉన్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో 2.5 కిలోల బంగారం ఉన్నట్టు సోనియా తెలిపారు. ఢిల్లీకి సమీపంలోని సుల్తాన్ పూర్, దేరా మండి గ్రామంలో 4.86 కోట్ల విలువైన 3.21 ఎకరాల భూమి ఉన్నట్టు సోనియా తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment