Video Of Day

Breaking News

'లెజెండ్'కు కొత్త చిక్కులు

balayya, lezend

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లెజెండ్ చిత్రం విజయపథంలో దూసుకెళ్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే నలభై కోట్ల రూపాయలు కొల్లగొట్టి యాభైకోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తున్న ఈ చిత్రానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో.. చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. లెజెండ్ ను రిలీజ్ కు ముందే ఈసీ సర్టిఫై చేసినా... ప్రస్తుతం బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో సినిమా ప్రదర్శనను నిలిపేసే అవకాశం ఎక్కువగా ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా లెజెండ్ విజయోత్సవాల్లో ఉన్న నందమూరి అభిమానులకు ఇది జీర్ణించుకోలేని వార్తే..

No comments