చంద్రబాబు కూడా అబద్ధం చెప్పారు!

chandrababu-lies-in-affidavit

కుప్పం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నామినేషన్ సందర్భంగా సవుర్పించిన అఫిడవిట్‌లో అబద్ధపు వివరాలు పేర్కొన్నారు. తన పేరుపై ఒక కారు, భార్య భువనేశ్వరి పేరుపై మరో కారు ఉందని పేర్కొన్నారు. అయితే భువనేశ్వరి పేరుపై రెండు కార్లు ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖ రికార్డుల్లో నమోదై ఉంది. అఫిడవిట్‌లో చంద్రబాబు పేరుపై రూ.2,22,500 విలువైన అంబాసిడర్ కారు (ఏపీ 09 జీ 0393), తన భార్య భువనేశ్వరి పేరుపై రూ.91,92,946 విలువైన కారు (ఏపీ 09 బీవీ 0393) ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే భువనేశ్వరి పేరుపై రూ.12 లక్షల విలువైన మరో కారు కూడా రిజిస్టర్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రికార్డుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment