Video Of Day

Breaking News

సీపీఎం పోటీ నివారణ!

cpm not competing

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తులకు సిద్ధమంటూ ఆఫర్ ఇచ్చినా.. ఏ ఒక్క పార్టీ ముందుకు రాకపోవడంతో సీపీఎం కొత్త ప్రతిపాదనను ముందుకు తెస్తోంది. అసలు పోటీనే నివారించుకోవడానికి సిద్ధపడుతోంది. దీని ప్రకారం సీపీఎం తనకు తోచిన సీట్లలో పోటీ చేస్తుంది. పోటీ చేయని చోట కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు మద్దతు ఇస్తుంది. అయితే, ఆ పార్టీలు సీపీఎంతో పోటీ నివారణ అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సీపీఎం అభ్యర్థులు బలంగా ఉన్నచోట్ల.. ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుని సీపీఎంకు మద్దతు ఇవ్వాలి.  కాంగ్రెస్, బీజేపీలను ఓడించడానికి పరస్పర పోటీ నివారణ కోసమే ఈ ప్రతిపాదనను సీపీఎం వర్గాలు తెచ్చినట్లు సమాచారం!

No comments