దానం నాగేందర్ కు కొత్త చిక్కు?

danam-nagender-to-be-arrest

2011 అక్టోబర్ 16న ఈస్ట్ మారేడ్‌పల్లికి వెళ్తున్న శ్రవణ్‌కుమార్, నర్సింహయాదవ్లను అక్కడే ఆసుపత్రి ప్రారంభానికి వచ్చిన దానం నాగేందర్‌, వీర్‌వల్లభ్, మరికొందరు కోడిగుడ్లు విసిరారని భావించి.. కొట్టి గాయపరిచారంటూ భాదితులు చేసిన ఫిర్యాదు ఇప్పుడు దానం నాగేందర్ మెడకు చుట్టుకుంది. మాజీ మంత్రి దానం నాగేందర్, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన వీర్‌వల్లభ్లు భాదితులపై దాడి చేశారనే ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని గోపాలపురం డివిజన్ ఏసీపీ హైకోర్టుకు నివేదించారు. ఈ కేసులో దానం సహా ఇతర నిందితులను త్వరలోనే అరెస్టు చేయాలని చూస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం కావడంవల్లే దర్యాప్తు సకాలంలో పూర్తి కాలేదని విన్నవించారు. 15 రోజుల్లో సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం సరిగ్గా ఎలక్షన్ల ముందు దానంకు కొత్త చిక్కు తెచ్చి పెట్టింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment