కేవీపీ ఆరెస్టు వాయిదా పడనుందా?

is-kvp-arrest-will-postpone

టైటానియం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావు ఆచూకి కోసం అమెరికా కోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని, ఆయనను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ విచారించనుందని ప్రచారం జరిగింది. అయితే కేవీపీ అరెస్టుకు కేంద్రంలో అడ్డు చక్రం పడే అవకాశం ఉంది. ఇంటర్‌పోల్ నుంచి అందిన నోటీసులను సీబీఐ... సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్‌కు ఈనెల 12వ తేదీనే పంపినట్లు సమాచారం. దీనిపై కృష్ణప్రసాద్ అత్యున్నత స్థానంలో ఉన్న వారితో సంప్రదింపులు జరిపి, ఈ మొత్తం విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. కేవీపీ అరెస్ట్ విషయంలో తొందరపడకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. రెడ్ నోటీసులో సాంకేతిక అంశాలను ఎత్తిచూపుతూ అరెస్ట్‌లో జాప్యం చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.  
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment