రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగిస్తారా?

is-president-rule-extend-in-ap

ఈ నెల 30తో మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి రెండు నెలలు పూర్తి కాబోతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌ను సమావేశపర్చడం సాధ్యం కాదు. కాబట్టి, ఏప్రిల్ 30న రాష్ట్రపతి పాలన ముగిసిపోగానే సుప్తచేతనావస్థలో ఉన్న శాసనసభను పునరుద్ధరించాలి. ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అదీ కష్టమే. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి పాలనను రద్దు చేసి మళ్లీ కొత్తగా విధిస్తే సరిపోతుందన్న వాదనా ఉంది. కానీ, ఇందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సానుకూలంగా లేనట్లు సమాచారం. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందాక ఆరు నెలల పాటు అది అమలులో ఉంటుంది. కావాలంటే, ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు పొడిగించుకోవచ్చు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉంటుంది. అయితే, మొదటి సారి విధించిన రాష్ట్రపతి పాలనకే పార్లమెంట్ ఆమోదం లేకపోతే మళ్లీ ఎలా విధించాలన్నది రాష్ట్రపతి ప్రణబ్ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో.. దీనిపై ఏంచేయాలో తేల్చుకోలేక కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని గండం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు ప్రారంభించింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment