నాగార్జున కబ్జాకోరు

kcr-comments-on-nagarjuna-chandrabau

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ హీరో నాగార్జున కబ్జాకోర్లంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే భూములన్నీ కక్కిస్తమని వారు భాదపడుతున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్ భూములను లగడపాటి కబ్జా చేసిండని కూడా కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వస్తే అవన్నీ గుంజుకుంటం. ఎంత పెద్దోళ్లయినా వదిలిపెట్టమన్నారు. ఇవన్నీ జరగాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలంటూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యమో, ఎంపీలు కూడా అంతే ముఖ్యం. కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే ఎంపీలు కావాలని, అప్పుడే ముక్కుపిండి అనుమతులు తెచ్చుకోగలమని తెలిపారు. అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించాలంటూ కోరారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment