పవన్ ను ఏకిపారేసిన కేసీర్తాట తీస్తానంటూ సినిమా డైలాగుల రేంజిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలపై టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు దీటుగా స్పందించారు. రోజుకు పది కుక్కలు తనను తిడుతుంటాయని, వాటిని పట్టించుకోనని అంటూనే పవన్ను కుక్కతో పోల్చి తన మార్క్ స్టైల్లో ఏకిపారేశాడు. అంతటితో ఆగకుండా "వాడెవడో సినిమా యాక్టర్ అట. వాడి సినిమాలు నేనైతే చూడలేదు. తెలంగాణ గడ్డ వరంగల్ లో నా తీట తీస్తానని అన్నాడట.  నాలుగు రోజులాగితే ఎవడి తాట ఎవడు తీస్తాడో తెలుస్తుంది' అని కేసీఆర్ అన్నారు. వరంగల్ సభలో నరేంద్రమోడీని, దళిత నాయకులను తిట్టినా, ఆరోపణలు చేసినా కేసీఆర్ తాట తీస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మోడీని వదిలిపెట్టలేదు. మోడీ పిచ్చోడంటూ ధ్వజమెత్తారు. మోడీ, పవన్, చంద్రబాబు అంటే పంగనామాలని ఎద్దేవా చేశారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment