కేవీపీ పైరవీతోనే పొన్నాలకు పీసీసీ


తెలంగాణ పీసీసీ పీఠాన్ని అధిష్టించిన పొన్నాల లక్ష్మయ్య వెనుక మాజీ ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు ఉన్నారా? ఆయన పైరవీతోనే పొన్నాలకు పీసీసీ పీఠం దక్కిందా? తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించిన ‘చేవెళ్ల గర్జన’ సభతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ బహిరంగ సభలోనూ, శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆల్వాల్ సభలోనూ మాట్లాడారు. పొన్నాలపై పైస్థాయిలో తీవ్ర విమర్శలు చేశారు. పొన్నాలకు నిధులు కూడా ఇచ్చేది కేవీపీనేనని తేల్చేశారు. ఆంధ్రా నాయకుల డబ్బులు తీసుకుని రేపు ఆంధ్రాకు పని చేస్తరా? తెలంగాణకు పని చేస్తరా? అని ప్రశ్నించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment