కేవీపీకి కొత్త చిక్కు?

kvp-in-trouble-america-court

ఆంధ్రప్రదేశ్‌లో టైటానియం ఖనిజాన్ని తవ్వుకునే అనుమతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులకు రూ.111 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన కేసులో కేవీపీ రామచంద్రరావు సహా ఆరుగురిపై అమెరికా ప్రభుత్వం అభియోగాల్ని నమోదుచేసింది. ఈ ముడుపుల సూత్రధారి, ఉక్రెయిన్‌కు చెందిన పెద్ద వ్యాపార వేత్త దిమిత్రీ ఫిర్టాష్‌ (48) ఫిర్టాష్‌ కంపెనీల్ని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని, నిందితులు ఆరుగురికీ రూ.64 కోట్ల జరిమానా విధించాలంటూ షికాగో న్యాయస్థానాన్ని అమెరికా ప్రభుత్వం అభ్యర్థించింది. అసలేం జరిగిందంటే... టైటానియం ఖనిజ నిక్షేపాలను అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ ఆశించింది. వీటిని వెలికి తీసిపెట్టే బాధ్యతను ఉక్రెయిన్‌కు చెందిన డీఎఫ్‌ సంస్థ తీసుకుంది.  ఈ ప్రాజెక్టు కార్య రూపం దాల్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారతప్రభుత్వం నుంచి లైసెన్సులు అవసరం. ఆ సంస్థ ఆ నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో భేటీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు దాదాపు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వకతప్పదని డీఎఫ్‌ నిర్ణయించుకుంది. కోట్ల రూపాయిల ముడుపులు బట్వాడా చేయడానికి నిందితులు అమెరికా ఆర్థిక సంస్థలను వినియోగించుకున్నారని అభియోగం. ఈ వ్యవహారంలో కేవీపీ రామచంద్రరావు కీలక పాత్ర పోషించినట్లు  తెలుస్తోంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment