లోకేష్ బాబు అలా అనేశాడేంటి?

jr ntr, lokesh

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు ఎన్నిలక ప్రచార పర్వంలో దిగారు. గుంటూరు పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రచారానికి జూనియర్ రాకపోవడం గురించి ప్రశ్నిస్తే.... ఎవరినీ ప్రత్యేకంగా పిలవడం లేదని.. బాలకృష్ణతో సహా అందరూ స్వచ్ఛందంగా ప్రచారానికి వస్తున్నారని బదులిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపలేదని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఇవన్నీ చెప్పడానికి లోకేష్ ఎవరని.. పార్టీలో ఆయన స్థానమేంటని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ కు, జూనియర్ కు మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తున్న విషయం తెలిసిందే... 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment