తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు: మన్మోహన్


కాంగ్రెస్, సోనియాగాంధీ కృషి, తోడ్పాటు, అకుంఠిత దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని కూనూరు వద్ద శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను అడ్డుకునేందుకు అనేక పక్షాల నుంచి అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా మాట నిలబెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్తోనే తెలంగాణలో ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment