Video Of Day

Breaking News

ఇంతకీ ఎవరు ఎవర్ని కలిశారు...

modi-rajani-meet

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఆదివారం సూపర్ స్టార్ రజనీకాంత్ ను చెన్నైలోని ఆయన ఇంటికెళ్లి కలిశారు. అయితే ఇది మీడియాలో మరో విధంగా ప్రచారమైంది. రజనీ... మోడీని కలిశాడంటూ కొన్ని చానళ్లు హోరెత్తించాయి. తెలుగు హీరోలు నాగార్జున, పవన్ కల్యాణ్ లు గుజరాత్ వెళ్లి మోడీని కలిసిన నేపథ్యంలో.. రజనీ మోడీని కలిశాడంటే.. ఆయన కూడా గుజరాత్ వెళ్లాడేమోనన్న అనుమానం రాకమానదు. అయితే భేటీ అనంతం రజనీ మీడియాతో మాట్లాడుతూ... ఇది కేవలం స్నేహపూరిత భేటీ మాత్రమేనని చెప్పారు. దీనికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి మోడీ ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తలైవార్ పేర్కొన్నారు.

No comments