మురళీ మోహన్ అరెస్టు!


ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సినీ నటుడు, టీడీపీ నాయకుడు మురళీమోహన్‌ ను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 29న ద్వారకాతిరుమలలో అనుమతిలేకుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించినందుకు ఆయనను ద్వారకాతిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురళీమోహన్‌తోపాటు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీరమణిపై కూడా కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి లోక్ సభకు టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన గత ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment