మోడీ ఆస్తులు రూ. 1.51 కోట్లేనా?

narendra-modi-assets
narendra modi
గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తనకు రూ. 1.51 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  తనకు సొంత వాహనం లేదని, గత రెండేళ్లలో ఆభరణాలేవీ కొనుగోలు చెయ్యలేదని పేర్కొన్నారు. తనకు రాజధాని గాంధీనగర్‌లో రూ. కోటి విలువైన ఇల్లు, రూ.51,57,582 విలువైన చరాస్తులు ఉన్నాయన్నారు. తన వద్ద రూ. 29,700 నగదు, రూ. 1.35 లక్షల విలువైన 4 ఉంగరాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. 2012-13కు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో ఆదాయాన్ని రూ. 4,54,094గా చూపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ తన ఆస్తులను రూ. 1.33 కోట్లుగా పేర్కొన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

1 comments:

  1. Why put question mark in the heading? Do you have any vested interest in doubting Narendra Modi's declared assets. Did you write about Rahul or Sonias' asset declaration? Why you have not doubted their assets and trying to single out Narendra Modi. You site is sponsored?

    ReplyDelete