Video Of Day

Breaking News

ప్రధాని అభ్యర్థిని ముందే ప్రకటిస్తే రాజ్యాంగ విరుద్ధమా?

ncp-sharad-pawar-comments-on-modi

దేశంలో ఇప్పటివరకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్నడూ ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి పేరును ముందుగా ప్రకటించి రాజ్యాంగాన్ని అవమానించిందన్నారు. రాయ్ గడ్ లోక్ సభ స్థానికి పోటీ చేస్తున్న ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తత్కరే తరపున పవార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రజలు ఎలా నమ్ముతారని పవార్ అన్నారు. గుజరాత్ రాజధానికి సమీపంలో కాంగ్రెస్ ఎంపీని తగులబెడితే కనీసం బాధితుడి కుటుంబ సభ్యులను కూడా మోడీ పరామర్శించలేదని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి దేశానికి ఏం భరోసా ఇవ్వగలరని ప్రశ్నించారు.

No comments