చేవెళ్లలో కొత్తా నాయకులండీ!

kartheekareddy-vishweshwarreddy-veerenderreddy

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని నాయకులు హఠాత్తుగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులుగా దర్శనమిచ్చారు. ప్రధాన పార్టీల తరఫున బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తూళ్ల వీరేందర్‌గౌడ్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇతను మాజీ హోంమంత్రి టి.దేవేందర్‌గౌడ్ తనయుడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా మొదటిసారిగా పోటీలో తలపడుతున్నారు. ఇతడు మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు. అదేవిధంగా ఇదే స్థానం నుంచి దివంగత ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మనవడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నాడు. ఇతను కూడా మొదటిసారి పోటీ చేసే అభ్యర్థే!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment