వైఎస్ఆర్ కాంగ్రెస్ సీటు నష్టపోవాల్సిందేనా?

one-seat-loss-for-ysr-congress

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడంతో ఆళ్లగడ్డ శాసనసభ నియ్ఓజకవర్గం ఎన్నిక ఆగదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఆళ్లగడ్డ సిటింగ్ ఎమ్మెల్యే , వైఎస్ఆర్ కాంగ్రెస్  అభ్యర్ధి శోభ నాగిరెడ్డి మరణంతో ఎన్నిక ఆగుతుందా? లేదా అన్న సందేహాలు వెలువడ్డాయి. అయితే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా గుర్తింపు ఉన్న పార్టీ గా లేదు కనుక ఎన్నిక వాయిదా వేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం చెబుతోంది. దీనిపై నేడు(శుక్రవారం) స్పష్టత రానుంది. శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్లి ఆళ్లగడ్డలో ఎన్నికలు నిర్వహించే విషయంలో ఈసీని స్పష్టత కోరనున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ను మార్చడమా లేదా పోలింగ్‌ను వాయిదా వేసి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనా ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒక సీటునష్టం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందేమో!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment