టీ ముఖ్యమంత్రిపై ఒక్కోపార్టీ ఒక్కోమాట!


telangana cm

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అధికారం చేపట్టాలని అన్ని పార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో మాటను ఇస్తూ ముందుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి సీటు ఫలానా వారికే అంటూ హామీలు గుప్పిస్తున్నాయి. తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నారో లేదో వేరే విషయం. తర్వాత తెలంగాణలో అధికారం చేపడితే బీసీ ముఖ్యమంత్రి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి మహిళ కావాలన్నది తన కోరిక అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment