Video Of Day

Breaking News

పవన్ వర్సెస్ చిరు?

pawan-chiru-election-campaign-in-karnataka

రాజకీయాలు మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాయి. నమ్మిన సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సొంత అన్నయ్యనే ఎదిరించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. కర్నాటకలో ప్రత్యక్ష ప్రచార పోరుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్నయ్య కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే.. బీజేపీ తరఫున తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం కర్నాటకలోని తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే కోలార్, రాయ్ చూర్, గుల్బర్గా ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తంతు త్వరలోనే సీమాంధ్ర, తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మోడీ కార్యాలయం నుంచి సమాచారంతో పవన్ కల్యాణ్ ను బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిసి కర్నాటకలో ప్రచారాన్ని నిర్వహించాలని విజ్క్షప్తి చేశారు. దాంతో మంగళవారం ఉదయం కర్నాటకలో ప్రచారం నిర్వహించడానికి బేగంపేటలో ఓ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపుస్తుండగా, పవన్ కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో నినాదంతో ముందుకెళ్లనున్నారు.

No comments