కేసీఆర్ తాట తీస్తానన్న పవన్!

pawan-fire-on-kcr
బీసీ వర్గానికి చెందిన నరేంద్రమోడీని, దళిత నాయకులను తిట్టినా, ఆరోపణలు చేసినా టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు తాట తీస్తామని జనసేన పార్టీ అధిపతి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తనకు పిరికితనం చిన్నప్పటి నుంచీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  శనివారం ఆయన వరంగల్ జిల్లా పాలకుర్తి, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లలో జరిగిన ప్రచారంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో మద్దతు తెలిపినందుకే బీజేపీకి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. తొర్రూరులో పవన్‌కల్యాణ్‌తోపాటు ఎంపీ అభ్యర్థి పరమేశ్వర్, ఎమ్మెల్యే అభ్యర్థి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎంఎస్‌పీ ఎమ్మెల్యే అభ్యర్థి మంద కృష్ణమాదిగ పాల్గొనగా... హుస్నాబాద్‌లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment