పవన్ పరిస్థితి ఏంటి? ప్రభావం ఎంత?


pawan-kalyan-status-and-his-influence
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి మూడు నెలలు కావస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల మందే పార్టీ స్థాపించినప్పటికీ, ఓట్లు చీల్చకూడదనే నెపంతో ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. అందులో భాగంగానే పార్టీ తరఫున ఒక్క అభ్యర్ధిని కూడా బరిలో దింపలేదు. అయినప్పటికీ పవన్ కల్యాణ్కు తగిన ప్రాధాన్యతే దక్కుతోందని చెప్పొచ్చు. తనను, చంద్రబాబును ఒకే గాటిన కట్టిన కమల దళపతి, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పవన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ అయినా స్థిరంగా మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. పార్టీ స్థాపించడం నుంచి టికెట్ల రాయబారం నడిపే వరకు ఎదిగేశారు అప్పుడే. అదీ బెడిసి కొట్టి ఓటర్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఒక ప్రాంతంలో రాష్ట్రం విడిపోయినందుకు బాధగా ఉందని అంటూనే... మరో ప్రాంతంలో పదేళ్లుగా ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని అంటారు. రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్ ను హటావో అంటాడు. విభజనకు సహకరించిన బీజేపీతో దోస్తీ అంటారు. ఇలాంటి నేతను మోడీ చేరదీసి ఓట్లను పొందాలనుకుంటే అది వ్యర్థప్రయత్నమే అవుతుంది. ఇదిలాఉంటే బీజేపీ పార్టనర్ అయిన టీడీపీకి పనవ్ ఏమేరకు సహకరిస్తారో సందేహమే. ఒక్క సీటు విషయంలో టీడీపీతో తేడాలు వచ్చి సాన్నిహిత్యం బెడిసి కొట్టింది. అందుకే హైదరాబాద్ సభలో పవన్ చంద్రబాబు గురించి పెద్దగా మాట్లాడలేదు. దీంతో చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించాల్సి వచ్చింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment