Video Of Day

Breaking News

రాహుల్ కు నివాస ధృవీకరణకు నో : అమెథీలో చేదు అనుభవం

ప్రత్యర్థి పార్టీలకు అవకాశమిస్తున్న రాహుల్ ప్రవర్తన
జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్ వర్గీయులు

హైదరాబాద్ః దేశ భావి భారత ప్రధాని, రారాజు రాహుల్ గాంధీ ప్రవర్తన కాంగ్రెస్ సీనియర్ నేతల్లో,  కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది. నిరాడంబరతకు నిదర్శనం, పదవుల త్యాగానికి వారి కుటుంబం తప్ప ఇంకోకటి లేదు అని చెప్పుకునే జాతీయ కాంగ్రెస్ కు రారాజు చేసే పనుల వల్ల కాంగ్రెస్ నాయకులకు కొంత ఇబ్బందికరంగా మారుతోంది. ఎందుకంటే గురువారం అమేథీలో ఎదురైన సంఘటనలు వింటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆశ్చర్య పోక తప్పదు. అమేథీ పార్లమెంటు నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తిరిగి మూడో సారి అమెథీ నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా పోటీ చేసే అభ్యర్థికి స్థానికంగా నివాసముంటున్నట్లు నివాస గృహ ఆధారాలు చూపించాలి. ఇందులో భాగంగా తన సొంత ఇంటికోసం సబ్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోగా గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇంతవరకు ఏమి చేశావు? ఎంత ఖర్చు చేశావు. బ్యాంక్ ఖాతా, ఆధార్, ఫోటో గుర్తింపు ఏవీ లేకుండా మీకు నివాస ధృవీకరణ పత్రం ఇచ్చేది లేదుంటూ రాహుల్ అభ్యర్థనను సబ్ కలెక్టర్ తిరస్కరించారు. దీంతో భావి భారత ప్రధానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లు ప్రారంభంలోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది.  దీంతో దీన్ని ప్రత్యర్థి పార్టీలు రాహుల్ యొక్క తప్పులను ఎత్తిచూపే ప్రమాదముందని కాంగ్రెస్ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. భావి భారత ప్రధాని చేయాలన్న కాంగ్రెస్, యూపీఏ కూటమి కలలను కళ్లలు చేస్తున్నారు యువరాజు. మున్ముందు యువరాజుకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వేచిచూడాల్సిందే మరి.

No comments