రాజా వారి ఆస్తి విలువ 3కోట్ల 61 లక్షలేనట!

a raja assets value 3.61 crores only

తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి,  2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి ఎ.రాజా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2జీ వ్యవహారంలో దాదాపు కోటి 76 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. అలాంటి కేసులో ప్రధాన నిందితుడు అయిన రాజావారు తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి 3 కోట్ల 61 లక్షల ఆస్తులున్నాయని ప్రకటించడం విశేషం. నామినేషన్ పత్రంలో రాజా వారు తెలిపిన ఆస్తుల వివరాలు... రాజాకు, భార్య పరమేశ్వరి, కుమార్తె మయూరి పేరున ఉన్న స్థిరచరాస్తుల విలువ రూ..60 కోట్లు, అప్పులు  రూ.35.5 లక్షలు, తనపై  ఆదాయపు పన్ను కేసు, 2జీ స్పెక్ట్రం కేసు ఉన్నట్లు  పేర్కొన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment