ఈవీఎంలపై రేవంత్ రెడ్డి ఫొటో!

revanth-reddy-photo-on-evm

మహబూబ్ నగర్ జిల్లా కొడంగంల్ నియోజకవర్గంలోని కొన్ని ఈవీఎంలపై టీడీపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఫొటో వచ్చింది. నియోజకవర్గ పరిధిలోని కోహ్లి మండలం బాలికల ఉన్నత పాఠశాలలో గల 102, 104 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలతో పాటు, ఓటర్ల జాబితాలో కూడా రేవంత్ రెడ్డి ఫొటో కనిపించింది. దీనిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ఇలా జరిగిందని వారు ఆరోపించారు. తీవ్రస్థాయిలో ఆందోళన చేసి పోలీసు అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వెంటనే జోక్యం చేసుకుని ఫొటోలు తీయించేశారు. ఆ తర్వాత అక్కడ పోలింగ్ సజావుగా సాగింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment