శంకర్రావుకు నో టికెట్!

shankar-rao-no-ticket
తెలంగాణలో 111 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆరుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. ప్రధానంగా కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకరరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌లకు మొండిచేయి చూపారు. సీపీఐతో పొత్తు కారణంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు టిక్కెట్లు కోల్పోయారు. అనారోగ్యం కారణంగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే మణెమ్మ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వలేదు. రాజిరెడ్డికి బదులు ఆయన సోదరుడికి ఉప్పల్‌ టికెట్‌ ఇచ్చారు. బెల్లంపల్లి, మునుగోడు, పినపాక, వైరా, కొత్తగూడెం, కోదాడ, మహేశ్వరం, దేవరకొండ స్థానాలకు సీపీఐకి కేటాయించింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

1 comments:

  1. Chala manchi nirnayam, sonia bajana tappa prajala gurunchi okka roju alochinchina papana poledu, widu pedda kabja koru.

    ReplyDelete