శంకర్రావు ఆటలో అరటిపండేనా?

shankarrao not got seat

ఆరుసార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన, అధిష్టానానికి వీర విధేయుడిగా పేరుగాంచిన శంకర్రావుకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది. తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు వినయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. టికెట్టు కోసం ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఇదిలా ఉంటే తమకు జగన్ మోహన్ రెడ్డి సహా తదితర గిట్టనివాళ్లపై కేసులు పెట్టించటాని కాంగ్రెస్ అధిష్టానం శంకర్రావును బాగా వాడుకున్న విషయం తెలిసిందే. దానికి ప్రతిఫలంగా మంత్రి పదవిని కూడా శంకర్రావు పొందారన్నది వేరే విషయం. అయితే అదే శంకర్రావును కాంగ్రెస్ పార్టీ ఆటలో అరటిపండుగా తీసేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి కారణం శంకర్రావు తననోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి అధిష్టానానికి తలనొప్పిగా మారడడమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై గుస్సాగా ఉన్న శంకరన్న ఏ చేయనున్నారో?
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment