శోభా నాగిరెడ్డి కన్నుమూత!


రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు కన్నుమూశారు. 1968 నవంబర్‌ 16న ఆళ్లగడ్డలో జన్మించిన శోభానాగిరెడ్డి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె. ఇంటర్ వరకు చదివిన శోభానాగిరెడ్డి 1986లో భూమా నాగిరెడ్డిని వివాహమాడింది. 1996లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డే. ఆమె ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె మరణం కుటుంబ సభ్యులతోపాటు పార్టీ శ్రేణులకు కూడా తీరని లోటును మిగిల్చింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment