Video Of Day

Breaking News

నల్గొండ ప్రచారంలో సుష్మా, మన్మోహన్, జగన్!

sushma-and-manmohan-jagan-campaign-at-bhuvanagiri-on-sameday

బీజేపీ నాయకురాలు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ శనివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సాయంత్రం 4.05 గంటలకు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్‌లో ఆమె ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా శనివారమే భువనగిరి లోక్‌సభనియోజకవర్గం పరిధిలో బహిరంగసభలో పాల్గొంటున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, వరంగల్‌ జిల్లా జనగాం, నల్గొండజిల్లా చౌటుప్పల్‌తోపాటు హైదరాబాద్‌లోని జుమ్మేరాత్‌బజార్‌లో ఎన్నికల ప్రచార సభల్లోనూ సుష్మా పాల్గొంటారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని కోదాడ, హుజూర్‌నగర్, మధిర, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

No comments