ఇంతకీ ఈ 'సి' ఎవరైఉంటారబ్బా?

titanium-ores-andhrapradesh-america-case

ఆంధ్రప్రదేశ్‌లో టైటానియం ఖనిజాన్ని తవ్వుకునే అనుమతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులకు రూ.111 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన కేసులో కేవీపీ రామచంద్రరావు సహా ఆరుగురిపై అమెరికా ప్రభుత్వం అభియోగాల్ని నమోదుచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కుంభకోణంలో నిందితుడు కేవీపీయే అయినప్పటికీ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది ముఖ్యమంత్రి బంధువు 'సి' కీలక పాత్ర పోషించాడని అక్కడి దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పేర్కొంది. ఢిల్లీదాకా వెళ్లి అనుమతులు ఇప్పిస్తానని కూడా 'సి' భరోసా ఇచ్చాడని తెలిపింది. ఒక దశలో రేటు కూడా పెంచాలన్నట్లుగా కూడా అంటుంది. అత్యంత విలువైన టైటానియం నిక్షేపాలను ఎలాగైనా దక్కించుకొనేందుకు అమెరికా దిగ్గజ సంస్థ తరఫున వచ్చిన వచ్చిన దళారులు 'సి' డిమాండ్లకు తలొగ్గారు. కోరిన బ్యాంకు ఖాతాల్లోకి, కంపెనీల్లోకి నిధులను మళ్లించారని తెలిపింది. అయితే ఇంతకీ... 'సి' ఎవరన్నది మనముందు ఉన్న ప్రశ్న?

ఈ కేసులో ప్రభుత్వ సలహాదారుగా కేవీపీ పేరును నేరుగా వెల్లడించిన ఎఫ్‌బీఐ.. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ బంధువు అంటూ పేరు ప్రస్తావించకుండా 'సి' అంటూ మరో వ్యక్తినీ తెరపైకి తెచ్చింది. టైటానియం లీజులకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపిందీ, అదనంగా ముడుపులను డిమాండ్‌ చేసిందీ 'సి'యేనని ఎఫ్‌బీఐ తెలిపింది. 'సి' అంటే జగన్మోహన్ రెడ్డి కాక మరెవరు?'' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ 'సి' ఎవరన్నది కచ్చితంగా తెలియాలంటే ఎఫ్ బీ ఐ చెప్పేవరకు వేచిచూద్దాం!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment