వర్మేంటి ఇలా తగులుకున్నాడు?

rgv, pavan, ism

నాక్కొంచెం తిక్కుంది... దానికోలెక్కుంది అనే గబ్బర్ సింగ్ సినిమాలోని డైలాగ్ పవన్ కల్యాణ్ కు ఎలా అతికినట్టు సరిపోతుందో.. కుడి ఎడంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకూ సరిపోతుంది. పవర్ స్టార్ మీద ఇటీవల ఆయన వేసిన ట్విట్లే దీనికి నిదర్శనం. పవన్ రాజకీయాల్లోకి వస్తాడు... అనే ఊహాగానాలు కూడా పూర్తిగా మొదలవకముందే పవన్ రాజకీయాల్లోకి రావాలని, ఆయన లాంటి నిజాయితీ పరుడి సేవలు చాలా అవసరమని నివరధికంగా ట్విట్లు చేశాడు వర్మ.
       కట్ చేస్తే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక రామ్ గోపాల్ వర్మ కోరిక నెరవేరింది అనుకునేలోపు.. ఆర్జీవీలో తిక్క మళ్లీ మొదలైంది. విశాఖ ప్రసంగంలో పవన్ నిరాశ పరిచాడంటూ, ఇజమ్ పుస్తకం అర్థంపర్థం లేకుండా ఉందని, ఇన్ని ఇంగ్లిష్ నవలలు చదివిన తనకే అర్థం కావడం లేదంటూ చెలరేగిపోయాడు. తాజా నాలెడ్జ్, నిచ్చెన, బ్రూస్లీ అంటూ ట్విట్లు చేశాడు. ఏంటో ఈ మేధావుల మాటాలు, పనులు... మనలాంటి సామాన్యులకు అర్థం కావు.
Share on Google Plus
  Blogger Comment
  Facebook Comment

2 comments:

 1. pawan and ramgopal varma iddariki tikka vundi
  kaaani daniki lekka lekapovadame mana karma...

  ReplyDelete
 2. @sambasivarao
  What u said is absolutely correct..

  Pawan heroism nu cinemallo choopisthe chalu

  Rajakeeyallo janalakosam panicheyali


  YS jagan is the next ruler of AP

  ReplyDelete