ఎక్కువ ఓట్లు వస్తే గెలుపు శోభదే!


votes-for-shobha-nagireddy suspense cleared from election commission

ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతి(ఈ నెల 24న రోడ్డు ప్రమాదంలో)తో ఆ ఎన్నికపై పలు సందేహాలు వెలువడ్డాయి. ఆళ్లగడ్డ స్థానంలో ఎన్నికలను వాయిదా వేస్తారా? లేదా కొత్త అభ్యర్థికి స్థానం కల్పిస్తారా? లేదా యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా శోభకు పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా నోటా కింద పడేస్తారా? శోభ తర్వాత ఎక్కువ ఓట్లు లభించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారా? .. ఇలా పలు సందేహాలను ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేసింది. ఈ నియోజకవర్గానికి యథావిధిగా ఎన్నిక జరిపి, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన దివంగత శోభా నాగిరెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైతే ఆమెను గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఆమె మరణించినందు వల్ల  ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక నిర్వహిస్తామని కూడా వివరించింది. నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించిన తర్వాత జరిగే పోలింగ్‌లో ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైతే గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వివరణలో పేర్కొంది.ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆమె పేరును వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాలట్ పత్రాల్లో ముద్రించామని, అందువల్ల మరణించిన అభ్యర్థికి ఓట్లేస్తే అవి ’నోటా’ ఓట్లు (ఎవరికీ చెందని ఓట్లు)గా పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment