కాంగ్రెస్ మహిళల్లో సీఎం సీటుకు సమర్థులెవరు?

who-is-the-correct-for-cm

తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి కావాలనుందంటూ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పేర్కొన్న నేపథ్యంలో టీకాంగ్ మహిళానేతల్లో ఆ స్థానానికి సమర్థులెవరంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డిలతోపాటు సినీ నటులుగా రాణించి రాజకీయాల్లో దూసుకువెళ్తున్న జయసుధ, విజయశాంతి ఇలా అనేక పేర్లు తెరమీదకు వచ్చేశాయి. తెలంగాణ మహిళా నేతలలో మాజీ మంత్రి గీతారెడ్డి బాగా సీనియర్. ఓ దశలో ఆమె ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ పడిన విషయం తెలిసిందే. రాహుల్ తాజా ప్రకటనతో ఆమెకు సీఎం పదవిపై ఆశలు అమాంతం పెంచేసుకుంది. ఇక గద్వాల్ మహిళా నేత, మరో మాజీమంత్రి  డీకే అరుణ కూడా సీఎం రేసులో ఉన్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జయసుధ, అలాగే ఇటీవలే కారును వదిలి చేయందుకున్న విజయశాంతి పేర్లు కూడా సీఎం రేసులో ముందుంటాయి. అయితే ఎవరికి అవకాశం దక్కనుందో వేచిచూడాల్సిందే!!

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment