బాలకృష్ణ ఎందుకు పోటీ చేయనంటున్నారు?

why-balakrishna-not-contesing-in-elections

రేపో, మాపో బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై అధికార ప్రకటన వెలువడుతుందని ఆశించిన ఆ పార్టీ కార్యకర్తలకు, బాలయ్య బాబు అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురయ్యేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేయడమే దానికి కారణం.  ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదంటూనే పార్టీ ఆదేశిస్తే పునరాలోచిస్తానని చెప్పడం విశేషం.  తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి హీరో బాలకృష్ణ రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో
ఈ నెల 17న బాలకృష్ణ నామినేషన్ కూడా వేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ధర్మపురిలో నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పి పోటీపై ఆసక్తి లేదని వెల్లడించారు. బాలకృష్ణ ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమేముందో మరి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment