జూ.ఎన్టీఆర్ ఎందుకు ప్రచారం చేయడం లేదు!

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూ. ఎన్టీఆర్ ఈ సారి మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వర్గాలు కూడా జూనియర్ ప్రచారాన్ని సీరియస్గా తీసుకోలేదు. ప్రత్యేక ఆహ్వానాలు ఎవరికీ ఉండవంటూ, నచ్చిన వారు వచ్చి ప్రచారం చేయాలని వారు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని లోకేష్ బాబుతో సహా బాలయ్య బాబు కూడా ప్రకటించేశారు. బొట్టు పెట్టి పిలిచే సమస్య లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ , హరికృష్ణలనుద్దేశించి పరోక్షంగా విసుర్లు విసిరారు. అయితే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. తనపై మీడియాలో వస్తున్న కథనాలపై ఓ దశలో వివరణ కూడా ఇవ్వాలని జూ. ఎన్టీఆర్ భావించారు. టీడీపీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉండవలసి వచ్చిందో వివరించాలని భావించారు. తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి దూరమవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి జూనియర్ వెల్లడించనున్నారని సమాచారం.  అంతేకాకుండా పార్టీ అధినేత కూడా జూనియర్ ను ప్రచారానికి పిలవకుండా పవన్ చుట్టూ చక్కర్లు కొట్టడంపై బొట్టు పెట్టి పిలిచేది లేదన్న నాయకులు ఏమంటారో మరి! ఏదేమైనా ఈ విషయంపై జూనియర్ నోరు విప్పితేనే అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుంది మరి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment