వైఎస్, జగన్ ల పై 'పవర్' పంచ్ లు!

pawan comments on ysr and ys jagan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముందుగా ఊహించినట్లుగానే టీడీపీవైపునకు వాలిపోతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూను పవన్ పూర్తిగా వైస్ రాజశేఖర రెడ్డి, జగన్లను విమర్శించడానికే కేటాయించినట్లుంది. లోపాయికారిగా చంద్రబాబుకు మద్ధతు ప్రకటించినట్లే ఉంది. వైఎస్ఆర్ హయాంలో పూర్తిగా అవినీతి జరిగిందంటూ, అది అందనంత ఎత్తుకు చేరుకుందంటూ విరుచుకుపడ్డారు. రాజశేఖరరెడ్డి హయాంలో దోచుకోవటే అధికారుల, నాయకుల భావజాలమైపోయిందన్నారు. చోటామోటా గల్లీస్థాయి నాయకుల్లో దోచుకోవాలనే భావజాలం నిండిందన్నారు. 'మావాడు(చంద్రబాబు) తిననివ్వడు.. ఆయన తిననిస్తాడు(వైఎస్ఆర్) అంటూ టీడీపీ నేతలే పేర్కొటున్నట్లు ఉటంకించి చంద్రబాబును పైకెత్తుకున్నారు. అంతటితో ఆగకుండా జగన్ పైనా విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి అవటానికి తొందరపడాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఓవ్యక్తి పోగానే... మొత్తం తనకే కావాలనే... అదీ వెంటనే కావాలనుకునే కాంక్ష రాజకీయ అస్థిరతకు దారితీసిందన్నారు. అంతేకాకుండా జగన్‌కు సలహా కూడా ఇచ్చేశారు. ముందుగా అన్ని కేసుల నుంచి స్వచ్ఛంగా బయటపడ్డాక ముఖ్యమంత్రి పదవికోసం ప్రయత్నిస్తే బాగుంటుందన్నారు. ఆయనపై ఉన్నవి అభియోగాలే అయినా వాటి నుంచి సచ్చీలుడిగా బయటపడ్డ తర్వాత మళ్ళీ రావొచ్చుగదా అని అనిపిస్తోందన్నారు. వందలు, వేలు, లక్షల పేజీలు... ఒక గది నిండా ఉండే రికార్డులతో కూడిన కేసులు రుజువుకానంత మాత్రాన సరైనదైపోతుందా? బోలెడన్ని అభియోగాల్ని వెంటబెట్టుకొని వెళితే జనాలెలా నమ్మేది? మంచి పాలన చేస్తారని ఎలా ఆశించొచ్చు? ఇన్ని అభియోగాలున్నా సుపరిపాలన అందిస్తానని ఎలా నమ్మిస్తారు? నాపై అభియోగాలున్నాగాని నేనిలా ప్రభుత్వాన్ని నడిపిస్తా అని ప్రజలకు నమ్మకం కలిగించాలి. నన్ను పాలించాలనుకునే వ్యక్తి నుంచి అది నేను కోరుకుంటా! అభియోగాల నుంచి బయటపడాలిగా ముందు. నాకసలు వీటితో సంబంధం లేదని చెప్పగలగాలి! మళ్లీ చెబుతున్నా నాకింతదాకా అర్థంగాని విషయమేమంటే... ఇంత తక్కువ సమయంలో ఇన్ని రెట్ల సొమ్ము ఎలా సంపాదిస్తారనేది?
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment