9మంది మృతి. 13 మందికి పైగా గాయాలు


 9 people killed. More than 13 injuries
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వివిధ ఘటనల్లో 9 మంది మృతి13మందికి పైగా గాయాలుతీవ్రమైన గాలిదుమారం శుక్రవారం సాయంత్రం బీభత్సం సృష్టించింది.ప్రచండమైన వేగంతో వీచిన ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు  నేలకూలాయి. చెట్లు విరిగిపడటం, గోడలు కూలడం, విద్యుత్ తీగలు తెగిపోయాయి. విద్యుదుత్పత్తి కేంద్రాలపై కూడా దీని ప్రభావం పడింది.నగరంలోని పలు చోట్ల కురిసిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దాదాపు గంట పాటు నగర వాసులకు నరకం చూపించి అనంతరం వాతావరణం ప్రశాంతమైంది.  సాయంత్రం 4.58 గంటలకు ఒక్కసారిగా ఢిల్లీ వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఉరుములు, దాదాపు గంటకు 90 కి..మీల వేగంతో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఆకాశాన్ని దుమ్ము, దూళి రేణువులు కమ్మేసి, సాయంత్రానికే చీకట్లు అలముకున్న పరిస్థితి నెలకొంది.  దాదాపు  గంటపాటు మెట్రో రైళ్లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం కావడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు సహా వేలాది మంది ప్రయాణీకులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దాదాపు 18 దేశీయ, ఒక అంతర్జాతీయ విమానాలను సమీపంలోని ఎయిర్‌పోర్టులకు దారిమళ్లించారు. దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్), నోయిడా, ఘజియాబాద్‌ల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. దీనికి క్యుములో నింబస్ వాతావరణ పరిస్థితుల కారణమని, మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment