విమానం ఎక్కలనుకుంటున్నారా 339 రూపాయలకే

Embarking 339 aircraft availabili

న్యూఢిల్లీ : చెన్నై నుంచి బెంగళూరు వెళ్లాలంటే  రైల్లో వెళ్తే స్లీపర్ క్లాస్ అయితే 230రూపాయల నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే 1360 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రయాణ సమయం కూడా సూపర్ ఫాస్ట్ రైలు అయితే.. అది కూడా రైలు ఆలస్యం కాకపోతే కనీసం ఆరు గంటలు పడుతుంది. అదే మీరు విమానం ఎక్కితే జస్ట్ 339రూపాయలు చెల్లిస్తే చాలు.. ప్రశాంతంగా కూర్చుని హాయిగా అరగంటలో వెళ్లిపోవచ్చు.  దీనికి అదనంగా ఒక్క పైసా కూడా మీరు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. 339రూపాయలు ఇస్తే చాలు చెన్నై నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లిపోవచ్చు. అదే బెంగళూరు నుంచి చెన్నైకి మాత్రం టికెట్ ధర 490రూపాయలు.

తక్కువ ఖరీదుతో విమానయానాన్ని అందించాలని తలపెట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ఈ సరికొత్త ఆఫర్ తో తన సేవలు ప్రారంభించింది.  శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి టికెట్ బుకింగ్ మొదలైపోయింది. ఇప్పటికే చాలావరకు టికెట్లు అయిపోయాయి కూడా. కొన్ని తేదీలకు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే, హైదరాబాద్ నుంచి మాత్రం ఈ విమానయాన సంస్థ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల దేశంలోని మిగిలిన నగరాలకు సంబంధించి మాత్రమే టికట్లు బుక్ చేసుకోవచ్చు.మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ బుకింగ్ ఆఫర్ అమలులో ఉంటుంది. ప్రయాణం మాత్రం జూన్ 12 నుంచి అక్టోబర్ 15 వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment