బాబుపై ప్రేమ ఉంటే పేజీలు రాసుకోండి'

If you love babu to write the pages'

మాచర్ల : చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటే రోజూ పేజీలు పేజీలు రాసుకోండి అంతేకాని లేనిపోని వార్తలు  రాయవద్దని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎల్లో మీడియాకు సంబంధించిన ఓ పత్రికలో తాను టీడీపీలో చేరుతున్నట్లు ఊహాగానాలతో వార్త ప్రచురించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరితో ఎప్పుడూ చర్చలు జరపలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రతిపక్షాన్ని... బలహీనపరిచేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండే తనలాంటి వారిపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లే అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. నిరాధార కథనాలను రాస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment