ఫైనల్లో కింగ్స్ ఎలెవన్

Kings XI in the final

 చెన్నైపై 24 పరుగులతో విజయం సెహ్వాగ్ సూపర్ సెంచరీ రైనా అద్భుత కష్టం వృథా20 ఓవర్ల ఆటలో ప్రేక్షకులకు అపరిమిత ఆనందం... బ్యాట్స్‌మెన్ వీర విహారం ముందు బౌలర్లకు చుక్కలు కనిపించాయి.  తొలుత వీర విహారంతో పంజాబ్ భారీ స్కోరు నమోదు చేస్తే, తామేమీ తక్కువ కాదంటూ చెన్నై ఆఖరి వరకూ పోరాడింది.  సెహ్వాగ్ సూపర్ సెంచరీ, రైనా అసాధారణ ఆట సీజన్ అంత సంచలన విజయాలతో దూసుకుపోయిన బెయిలీ బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లాగే ఇదీ  వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 226 పరుగులు నమోదు కావడం విశేషం.
 ముంబై: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో సారి జూలు విదిల్చింది. అద్భుత ప్రదర్శనతో తొలి సారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 24 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ {58 బంతుల్లో 122 :12: ఫోర్లు, 8 సిక్సర్లు} సూపర్ సెంచరీ సాధించగా, మిల్లర్ {19 బంతుల్లో 38 5ఫోర్లు,1 సిక్స్}, మనన్ వోహ్రా (31 బంతుల్లో 34; 1ఫోర్, 2సిక్సర్లు) అండగా నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా (25 బంతుల్లో 87; 12 ఫోర్లు, 6సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేయగలిగింది. ధోని (31బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోయింది.
 సెహ్వాగ్ దూకుడు...
  తొలి ఓవర్‌నుంచే సెహ్వాగ్, వోహ్రా జోరు ప్రదర్శించారు. చెన్నై బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో పవర్ ప్లేలో జట్టు 70 పరుగులు చేయగా9.1ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. 21బంతుల్లో సెహ్వాగ్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే వీరూ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. అర్ధ సెంచరీ తర్వాత అతను మరింత వేగంగా దూసుకుపోయాడు.   ఐపీఎల్‌లో రెండో సెంచరీని అందుకున్నాడు. వీరూ


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment